ఏపీ: అల్లూరి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం-హైలైట్స్ ▶️

త్రికాల తెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం ఆగస్టు 1,2026న అధికారికంగా ప్రారంభించారు. ఈ విమానాశ్రయం విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించబడిన రాష్ట్రంలోని తొలి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి. తొలి దశ నిర్మాణానికి సుమారు ₹ 5,640 కోట్ల వ్యయం జరిగింది.ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ప్రారంభోత్సవంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు ₹17,900–18,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశాకు అంతర్జాతీయ స్థాయి వైమానిక అనుసంధానాన్ని అందించనుంది.

తొలి దశలో సంవత్సరానికి సుమారు 60 లక్షల (6 మిలియన్) ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో రూపొందించబడింది. సుమారు 3,800 మీటర్ల రన్‌వే ఉండటంతో పెద్ద అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడి నుంచి సేవలు అందించగలవు. వాణిజ్య విమాన సర్వీసులు ఆగస్టు 17, 2026 నుంచి దశలవారీగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం నేవీ ఆధీనంలోని ప్రస్తుత విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గడంతో పాటు, కొత్త విమానాశ్రయం భవిష్యత్తులో ప్రధాన పౌర విమానయాన కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఈ ప్రాజెక్టుతో పర్యాటకం, ఐటీ, లాజిస్టిక్స్, కార్గో, డేటా సెంటర్లు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య వ్యాఖ్యలు

“”భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్‌వేగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం వల్ల పర్యాటకం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం”గా వేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో విమానాశ్రయాలకు ఒకే కుటుంబానికి చెందిన పేర్లు ఎక్కువగా పెట్టేవారని, ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గర్వకారణమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య వ్యాఖ్యలు

“”భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి ఇంజిన్‌గా మారుతుంది అన్నారు. విమానాశ్రయం చుట్టూ ఏరోసిటీ, ఐటీ, లాజిస్టిక్స్, డేటా సెంటర్లు, పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. లక్షలాది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. భోగాపురాన్ని అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య వ్యాఖ్యలు

“”ఇది ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక రోజు అని అభివర్ణించారు. ప్రధాని మోదీ “వికసిత్ భారత్” దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరిన క్షణం అని అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రానికి మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య వ్యాఖ్యలు

“”ఈ ప్రాంతం ఎర్ర బస్సులు తిరిగే ప్రాంతం కాదు. ఎయిర్ బస్సులు తిరిగే ప్రాంతం, వరల్డ్ మొత్తం ఇప్పుడు ఇటువైపు చూస్తోంది:””

ట్రెండింగ్ న్యూస్