భారత కరెన్సీలో కీలక మార్పు..పాలిమర్ నోట్లకు గ్రీన్ సిగ్నల్!

రూ.10, రూ.20 డినామినేషన్ నోట్లను ప్లాస్టిక్ ఆధారిత పాలిమర్ మెటీరియల్‌తో ముద్రించేందుకు RBI సిద్ధమవుతోంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలుత రూ.200 కోట్ల విలువైన పాలిమర్ నోట్లు చలామణిలోకి రానున్నాయి. ప్రయోగం విజయవంతమైతే 2027 ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయి సర్క్యులేషన్‌కు అవకాశం ఉంది. నోట్ల మన్నిక, భద్రతను పెంచడమే లక్ష్యంగా పాలిమర్ కరెన్సీపై RBI దృష్టి సారించింది.