- అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను!
మరోసారి రేవంత్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు
కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు - -ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

“”కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది అని నేనే చెప్తున్నాను. అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది. కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదు. నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరాను.

ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే జాతీయ కండువా కప్పుకున్నాను. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. పొంగులేటి, భట్టి సీఎం మాటలు వినడం లేదు. మంత్రులు పట్టించుకోవడం లేదంట, నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెబితే ఆయన కూడా పట్టించుకోలేదు. వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు.

నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా, నేను నీకు అమ్ముడుపోయానా? నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా అని అడిగాను.”అని ఒక కార్యక్రమంలో తన ఆవేదనను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బయట పెట్టారు.
#బిగ్ #బ్రేకింగ్ న్యూస్
అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను!
మరోసారి రేవంత్ పై ఫిరాయింపు MLA పోచారం తిరుగుబాటు."KCRను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు-ఫిరాయింపు MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి#pocharamsrnivasreddy #politics #telugu #trikalatelugu pic.twitter.com/b7rvEdxshz— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) August 11, 2026