- హర్ ఘర్ తిరంగా యాత్రపై బీజేపీ సన్నాహక సమావేశం
14న ట్యాంక్‌బండ్‌పై తిరంగా యాత్ర-రాంచందర్ రావు

హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా ఆగస్టు 14న మధ్యాహ్నం 3 గం.లకు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న భారీ తిరంగా యాత్రకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు.

ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు జరగనున్న ఈ తిరంగా యాత్రను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణపై జీహెచ్ఎంసీ పరిధిలోని 8 జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నాయకులతో రాంచందర్ రావు గారు సమగ్రంగా చర్చించి దిశానిర్దేశం చేశారు.

దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జాతీయ జెండాలతో తిరంగా యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
#HarGharTiranga at State BJP Office in Nampally, Hyderabad. pic.twitter.com/OftdCkvJqs
— N Ramchander Rao (@N_RamchanderRao) August 11, 2026