త్రికాల తెలుగు: ఎల్లారెడ్డి ప్రతినిధి ( శనివారం ఆగస్టు 15, 2026 ): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మొదట గాంధీ చౌక్ లో పార్టీ నాయకులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

తర్వాత అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం జరిగింది. 
ఆ తర్వాత ఎల్లారెడ్డి శిశుమందిర్ లో జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బిజెపి నాయకులు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు,
ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు AD. రాజేష్, మండల అధ్యక్షులు నరసింహారాజు మరియు పార్టీ సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు, పాల్గొన్నారు