నన్ను అనవసరంగా కొట్టారు-మాధురి రాథోడ్

నన్ను అనవసరంగా కొట్టారు-మాధురి రాథోడ్

తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ అకారణంగా తనపై చేయి చేసుకుందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో కోరారు ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్.

తనపై ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పలువురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పోలీసులను కోరారు మాధురి. తన వీడియోలు చిత్రీకరించడమే కాకుండా, తన ఐఫోన్ కూడా దొంగిలించారని ఫిర్యాదు తెలిపారు మాధురి రాథోడ్. మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వేములవాడ పోలీసులు.

ట్రెండింగ్ న్యూస్