- జాతీయ గేయం ‘వందేమాతరం’ను కాంగ్రెస్ అగౌరవపరచడం దేశద్రోహ చర్య: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాoచందర్ రావు
- వందేమాతరం ఆలాపన వేళ కాంగ్రెస్ అగ్రనేతల బాధ్యతారాహిత్యం – యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలి
- అడవుల్లో నక్సలిజం అంతమవుతుంటే.. నగరాల్లో వర్సిటీలను అడ్డాగా చేసుకుంటున్న ‘దిమాగీ నక్సల్స్’
- దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను విద్యార్థి లోకం తిప్పికొట్టాలి: ఎన్. రాoచందర్ రావు
చారిత్రాత్మక జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా దానిని సంపూర్ణంగా ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించిన తీరు అత్యంత గర్హనీయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాoచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

*జాతికి కాంగ్రెస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి*
వందేమాతర ఆలాపన జరుగుతున్న సమయంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ అగ్ర నాయకులు తీవ్ర అసహనం, నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని మండిపడ్డారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసిన పవిత్ర గేయాన్ని అవమానించడం దేశానికి వ్యతిరేకంగా చేసిన క్షమించరాని పాపమని పేర్కొన్నారు. ఈ బాధ్యతారాహిత్య వైఖరికి కాంగ్రెస్ నాయకత్వం బేషరతుగా యావత్ భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
*నగరాల్లో ‘అర్బన్ / దిమాగీ నక్సల్స్’ కుట్రలు*
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… దేశంలో కుహనా లౌకికవాదం, మేధావుల ముసుగులో కొందరు విద్యార్థుల్లో దేశ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ ఉక్కుపాదంతో అడవుల్లో నక్సలైట్లు తుపాకులు వదిలి లొంగిపోతుంటే, నగరాల్లో తిష్టవేసిన “అర్బన్ నక్సల్స్” విశ్వవిద్యాలయాల్లో ‘తుక్డే తుక్డే’ ముఠాలను తయారుచేస్తూ దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నారని హెచ్చరించారు.
*విద్యార్థి లోకానికి పిలుపు*
మేధావుల రూపంలో తిరుగుతూ యువత ఆలోచనలను విషతుల్యం చేస్తున్న అర్బన్ నక్సల్స్ కుట్రలను విద్యార్థులు ఎక్కడికక్కడ అప్రమత్తమై తరిమికొట్టాలని శ్రీ ఎన్. రాoచందర్ రావు పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు యువతరం ముందుండాలని ప్రకటనలో కోరారు ఎన్. రాoచందర్ రావు.