ఇరుముడి సెన్సార్ రిపోర్ట్ – ఎమోషనల్ థ్రిల్లర్!

మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి మూవీ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్‌తో పాటు ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరుముడికి సంబంధించిన తాజా బజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది.

U/A సర్టిఫికెట్:

తాజాగా ఇరుముడి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేయడంతో పాటు 2 గంటల 25 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లు సమాచారం. ఇక సెన్సార్ టాక్ విషయానికి వస్తే.. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కొన్ని సన్నివేశాల విషయంలో సర్‌ప్రైజ్‌కు గురైనట్లు తెలుస్తోంది.

సినిమా ఎలా ఉండబోతోంది..?

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో రవితేజ–కూతురు మధ్య ఉండే ఫాదర్-డాటర్ బాండింగ్ మంచి ఎమోషనల్ అనుభూతిని అందిస్తుందని సమాచారం. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఊహించని విధంగా వచ్చి థియేటర్లలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని సెన్సార్ టాక్. సెకండాఫ్‌లో కథ మరింత ఆసక్తికరంగా మారుతుందని.. క్రైమ్ థ్రిల్లర్ ఎపిసోడ్స్‌లో రవితేజ నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తోంది.

చివరి 40 నిమిషాలే హైలెట్:

ఇక సినిమాకు అసలైన హైలైట్‌గా చివరి 40 నిమిషాలు నిలుస్తాయని సమాచారం. అయ్యప్ప భక్తి నేపథ్యంలో సాగే దీక్ష, దానికి సంబంధించిన ఎమోషన్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని సెన్సార్ సభ్యుల నుంచి టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు మరో లెవల్ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంటాయని తెలుస్తోంది.

మల్లెపూల పల్లకి గూస్ బంప్స్:

ఇక చివర్లో ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ థియేటర్లలో మరో రేంజ్‌లో పేలబోతుందని సమాచారం. ప్రస్తుతం విడుదలైన పాటలో మిక్సింగ్, వాయిస్‌పై కొంతమంది నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్లలో వినిపించబోయే వెర్షన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ముఖ్యంగా స్పెషల్ DJ వెర్షన్‌తో పాటు థియేట్రికల్ సర్‌ప్రైజ్ ఉంటుందని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.

అదే నిజమైతే.. థియేటర్లలో ‘మల్లెపూల పల్లకి’ వచ్చినప్పుడు ఆడియన్స్ కుర్చీల్లో కూర్చునే పరిస్థితి ఉండదేమో అన్నంత రేంజ్‌లో ఈ పాట ఇంపాక్ట్ ఉండబోతుందని సెన్సార్ వర్గాల టాక్. అంటే స్క్రీన్‌పై పాట మొదలైన దగ్గర నుంచి థియేటర్లు దద్దరిల్లిపోయేలా, అభిమానులు సెలబ్రేట్ చేసుకునేలా ఈ వెర్షన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తంగా ఎలా ఉందంటే..?

మొత్తంగా చూస్తే ఎమోషన్ + క్రైమ్ + థ్రిల్ + యాక్షన్ + భక్తి అంశాల కలయికగా ఇరుముడి ఉండబోతున్నట్లు సెన్సార్ టాక్ చెబుతోంది. మరి సెన్సార్ సభ్యులను సర్‌ప్రైజ్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెప్పించబోతుందో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇప్పటికే నార్త్ అమెరికాలోనూ సినిమాకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. మరి ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఇరుముడి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

– జగదీష్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్