- సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో పర్యటన రద్దయినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. UKకు అనుమతి లభించినా.. అమెరికా పర్యటన విషయం లో నిబంధనలు పాటించలేరని.. అందుకే అనుమతి ఇవ్వలేక పోయామని విదేశీ వ్యవహారాల శాఖ ( MEA ) ప్రతినిధి రణధీర్ తెలిపారు.

విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకునేందుకు ‘తెలంగాణ రైజింగ్’ (Telangana Rising) ప్రతినిధి బృందంతో కలిసి ఆగస్టు 20న యూకే మరియు అమెరికా పర్యటనకు బయలుదేరిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు బోస్టన్‌కు వెళ్లకుండా ఆగస్టు 23న లండన్ నుండి నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.