ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు నిరసన సెగ @ మల్కాపూర్ ▶️

  • ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు నిరసన సెగ

త్రికాల తెలుగు ప్రతినిధి: కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామ పర్యటనకు వచ్చిన MLA మదన్ మోహన్ రావును మల్కాపూర్ గ్రామస్తులు శుక్రవారం( ఆగస్టు 21, 2026 )న అడ్డుకున్నారు. తమ గ్రామ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్ కొండ యోగితామధుతో పాటు గ్రామ ప్రజలు MLA కారుకు అడ్డు తగిలి శాంతియుతంగా నిరసన తెలిపారు.

ఈ క్రమంలో ఆయన అనుచరులు, పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‫స్టేషన్‫కు తరలించారు. తమపై MLA, అనుచరులు దాడి చేశారని గ్రామస్తులు ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రామస్తులను అరెస్టు చేయడాన్ని BJP, BRS పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు.

అయితే ఓట్ల సమయంలో కారు దిగి దండాలు పెట్టిన MLA,..ఇప్పుడు కారు దిగకుండానే అద్దాలు మూసుకొని పారిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఇప్పటికైనా గ్రామంలో MLA పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెప్తామని మల్కాపూర్ గ్రామస్తులు హెచ్చరించారు.

 

#Trikalatelugu ( త్రికాల తెలుగు ) @ https://x.com/home

ట్రెండింగ్ న్యూస్