త్రికాల తెలుగు: ప్రతినిధి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం, లింగంపేట మండల కేంద్రంలో తీజ్ పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పైడి ఎల్లారెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు.

నూతనంగా నిర్మించబోతున్న సేవాలాల్ దేవాలయానికి వెయ్యి బస్తాల సిమెంట్ సహాయం చేస్తానని పైడి ఎల్లారెడ్డి హామీ ఇచ్చారు. దీనితో ఆనందం వ్యక్తం చేశారు ప్రజలు.

ఆదివారం, ఆగస్టు 30, 2026న జరిగిన..ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు పెద్దెడ్ల నరసింహరాజుతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
