టీజీఎస్ఆర్‪టీసీలో ఎన్నికల నగారా..అక్టోబర్ 9న పోలింగ్

  • తెలంగాణ కార్మికులకు గుడ్‌న్యూస్
  • టీజీఎస్ఆర్‪టీసీలో ఎన్నికల నగారా
  • గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల
  • సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం
  • అక్టోబర్ 09, 2026 గుర్తింపు సంఘం ఎన్నికల కోసం పోలింగ్
  • ఉదయం 5:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పోలింగ్
  • అక్టోబర్ 14, 15, 2026తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు
  • అక్టోబర్ 17, 2026 ఎన్నికల ఫలితాల ప్రకటించనున్న అధికారులు

హైదరాబాద్ : సెప్టెంబర్ 18 : త్రికాల తెలుగు :  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో గుర్తింపు యూనియన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాయి. యూనియన్‌ను ఎన్నుకునేందుకు గాను రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ (జంట నగరాల) జాయింట్ లేబర్ కమిషనర్ శుక్రవారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు పూర్తి చేసే ఫలితాలను వెల్లడిస్తారు.

ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు:

సెప్టెంబర్ 21 (సోమవారం): పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న యూనియన్లు సమ్మతి పత్రాలను (Willingness) సమర్పించడం.

సెప్టెంబర్ 22 (మంగళవారం): ఆయా డిపో మేనేజర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను సంబంధిత జిల్లాల డిప్యూటీ రిటర్నింగ్ అధికారులకు (DCLs) అందజేయడం, యూనియన్ల నుంచి అభ్యంతరాలు కోరడం.

సెప్టెంబర్ 24 (గురువారం): ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఆఖరి తేదీ.

సెప్టెంబర్ 25 (శుక్రవారం): సంబంధిత డిపో మేనేజర్లు/యూనిట్ అధికారులతో చర్చించి అభ్యంతరాలను పరిష్కరించి తుది రూపు ఇవ్వడం.

సెప్టెంబర్ 26 (శనివారం): పోటీ చేసే యూనియన్లకు తుది ఓటర్ల జాబితా పంపిణీ, పోటీలో ఉండే యూనియన్లకు గుర్తుల కేటాయింపు, జిల్లాల డీసీఎల్లు తుది ఓటర్ల జాబితాను ప్రధాన రిటర్నింగ్ అధికారికి సమర్పించడం.

సెప్టెంబర్ 29 (మంగళవారం): పోటీ చేసే యూనియన్లు నమూనా బ్యాలెట్ పత్రాలను (Dummy Ballot Papers) డీసీఎల్ వద్ద నుంచి సేకరించడం.

అక్టోబర్ 09 (శుక్రవారం): పోలింగ్ తేదీ (ఉదయం 5:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు). PROF

అక్టోబర్ 14 & 15: పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ.

అక్టోబర్ 17 (శనివారం): ఫలితాల ప్రకటన.

భద్రత, ఏర్పాట్లపై దృష్టి..ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న TGRTC స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ యూనియన్, కార్మిక సంఘ్, తెలంగాణ జాతీయ మజ్జూర్ యూనియన్ సహా గుర్తింపు పొందిన ప్రధాన కార్మిక సంఘాలకు రిటర్నింగ్ అధికారి ముందస్తు నోటీసులు పంపారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంచిత సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీకి కూడా విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ న్యూస్