పని అడిగితే.గెస్ట్ హౌస్‪కు రమ్మన్న..సీఎం సన్నిహితుడు ! మహిళకు అవమానం ▶️

  • పని అడిగితే.గెస్ట్ హౌస్ రమ్మన్న..సీఎం సన్నిహితుడు !

సమాజంలో ఒక మహిళ స్వతంత్రంగా బతకడం నేరమా? స్వంత కాళ్లపై నిలబడి, నలుగురికి ఉపాధి కల్పించాలనుకోవడం తప్పా? పేదరికం నుంచి వచ్చి.. పిల్లలను సాకుతూ.. వ్యాపారంలో ఎదగాలనుకున్న ఒక అబల కన్నీటి ఆక్రందన ఇది. శోభారెడ్డి అనే ఒక మహిళా వ్యాపారవేత్త రోదిస్తూ చెబుతున్న నిజాలు వింటే అసలు మనమెక్కడున్నాం అనిపిస్తుంది.

పని కోసం వెళ్తే.. నా అర్హతను చూడలేదు.. నన్ను గెస్ట్ హౌస్‌కు రమ్మన్నారు” అంటూ మిధున అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని శోభారెడ్డి కన్నీరుమున్నీరవుతున్న తీరు రాతి గుండెలను సైతం కరిగిస్తోంది. ఒక మహిళ బాధలో ఉండి తన ఆవేదనను బయటపెడితే.. కనీసం ఆమెను ఓదార్చాల్సింది పోయి, ఆమెకి ఏ పార్టీతో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో బురదజల్లుతున్నారు. తన మానసిక క్షోభను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతులెత్తి మొక్కుతోంది ఈ బాధితురాలు.

అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌లో కాంట్రాక్ట్‌ల కోసం మున్సిపల్ శాఖ చుట్టూ రెండేళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఆ ఆఫీసర్ల అవినీతి వల్లే ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ బాధితురాలు శోభారెడ్డికి దక్కింది సాయం కాదు.. తీరని అవమానం! సీఎం గారికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా మాట్లాడి, గెస్ట్ హౌస్‌కు పిలిచాడు. ఇదా ఒక మహిళకు ఇచ్చే గౌరవం? ఒక మహిళ సహాయం కోసం వస్తే ఇంత దిగజారి వ్యవహరిస్తారా?

ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు లభించే రక్షణ ఇదేనా? ఒక మహిళ ధైర్యం చేసి తనపై జరిగిన అన్యాయాన్ని బయటపెడితే.. ఆమెకు రక్షణ ఇవ్వాల్సింది పోయి, సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. సోషల్ మీడియాలో ఆమెపైనే బురదజల్లుతారా? ఆమెకు పార్టీ రంగులు పులిమి, ‘నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్‌వి’ అంటూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? నిజానికి ఆమె వెనుక ఏ పార్టీ లేదు.. ఆమె కేవలం ఒక సాధారణ స్త్రీని మాత్రమే.

తనపై ఎవరెవరు తప్పుడు ప్రవర్తన చూపించారో, మున్సిపల్ శాఖలో ఎలాంటి అవినీతి జరుగుతోందో అన్ని ఆధారాలతో సహా సీఎం ముందే పెడతానని బాధితురాలు చెబుతోంది. ఒక్కసారి అపాయింట్‌మెంట్ ఇవ్వండి సార్ అని వేడుకుంది. వ్యాపారం చేయాలన్న సంకల్పాన్ని కాపాడాల్సిన వ్యవస్థ.. ఒక మహిళను ఇలా కన్నీరు పెట్టించడం ఎంతవరకు సమంజసం? మహిళా రాజ్యం తెస్తాం అని మైకులు పగలగొట్టే నాయకుల్లారా.. కన్నీళ్లతో ఒక మహిళ చేస్తున్న ఈ ఆక్రందన మీ చెవులకు వినిపిస్తోందా? ఆపదలో ఉన్న ఒక చెల్లెలి కన్నీటి పిలుపును విని సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు న్యాయం చేస్తారా? ఒక మహిళ ఆత్మగౌరవానికి దక్కే భరోసా ఏమిటి?

మహిళా సాధికారత అంటూ రకరకాల పథకాల పేర్లతో హోరెత్తించే ప్రచారాలు..కానీ..గ్రౌండ్ లెవెల్‌లో ఒక ఆడపిల్ల స్వయంశక్తితో బతకాలనుకుంటే జరిగేది ఇదేనా? తన కాళ్లపై తాను నిలబడి, నలుగురికి ఉపాధి కల్పించాలనుకున్న ఒక మహిళా ఎంట్రప్రెన్యూర్‌ను నడిరోడ్డుపై నిలబెట్టి కన్నీరు పెట్టించడమేనా మహిళా సంక్షేమం అంటే? ఒక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని చంపకండి. మిధున అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని శోభారెడ్డి అనే ఒక సాధారణ మహిళ.. కళ్ల నిండా నీళ్లతో చేతులెత్తి వేడుకుంటున్న ఈ దృశ్యాలు ఈ సమాజపు మగ అహంకారానికి, అవినీతి వ్యవస్థకు చెంపపెట్టు!

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్,

ట్రెండింగ్ న్యూస్