- జనసేన పార్టీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ గడల శ్రీనివాసరావు నియామకం
హైదరాబాద్,సెప్టెంబర్ 26: త్రికాల తెలుగు: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత బలోపేతం కోసం డాక్టర్ గడల శ్రీనివాసరావు గారిని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నూతన బాధ్యతల ద్వారా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని పటిష్టం చేయడంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించనున్నారు.

గతంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిధిలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ హోదాలో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించిన గడల శ్రీనివాసరావు అనుభవం తెలంగాణలో జనసేన పార్టీని రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా తీసుకెళ్లడంలో కీలకంగా నిలవనుంది. శ్రీనివాసరావు నియామకంతో పార్టీ సంస్థాగత కార్యక్రమాలకు కొత్త ఉత్సహం వస్తుందని, పార్టీ శ్రేణులు మరింత సమన్వయంతో పనిచేస్తారని ఆకాంక్షిస్తున్నాను.