- ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ఒక శక్తివంతమైన వేదిక
- మోదీ 25 ఏళ్ల నిర్విరామ దేశ సేవ స్ఫూర్తిదాయకం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్, సెప్టెంబర్ 27: త్రికాల తెలుగు: ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ పరిధిలోని గౌతమ్ నగర్ చౌరస్తాలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గారు బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సామాన్యుల విజయాలు, ఆవిష్కరణలను వెలుగులోకి తెస్తూ దేశ ప్రజలను ఏకం చేసే శక్తివంతమైన వేదిక ‘మన్ కీ బాత్’ అని పేర్కొన్నారు.

అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు దాదాపు 25 ఏళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా, ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసమే అంకితమైన నిజమైన కర్మయోగి ప్రధాని మోదీ అని కొనియాడారు. ఆయన నిరంతర శ్రమ మరియు అంకితభావం దేశంలోని ప్రతి ఒక్కరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయని తెలిపారు.