కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో దశబ్దాలుగా ఓడింది..SIR కారణమా? – అమిత్ షా ▶️🔥

  • కాంగ్రెస్ ఓటములపై అమిత్ షా విమర్శలు!
  • పలు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అధికారానికి దూరంగా కాంగ్రెస్.
  • ఆ పరాజయాలకు కూడా SIR కారణమా? – అమిత్ షా

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎదుర్కొంటున్న పరాజయాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉందని ప్రస్తావిస్తూ.. ఆ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు.

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి 64 ఏళ్లు, పశ్చిమ బెంగాల్‌లో 54 ఏళ్లు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో 41 ఏళ్లు, త్రిపురలో 36 ఏళ్లు, ఒడిశాలో 26 ఏళ్లు గడిచిపోయాయని అమిత్ షా పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి.. “ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటములకు కూడా ఎస్‌ఐఆర్‌ (SIR) కారణమా?” అంటూ ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోతోందని అమిత్ షా విమర్శించారు. ఎన్నికల్లో ఓటములకు ఈవీఎంలు, ఓటు చోరీ, ఎస్‌ఐఆర్‌ను కారణాలుగా చూపించడం కంటే.. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2, 2026న హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో భారీ మహా పాదయాత్రలో పాల్గొన్నారు.  ‘లోక్‌తంత్ర బచావో – అరాచకత హటావో’ (ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం) నినాదంతో ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు, ఆరోపణలు చేశారు.
https://twitter.com/i/status/2117243614531375168

ట్రెండింగ్ న్యూస్