షాకింగ్ న్యూస్..బీజేపీలో చేరనున్న క్రికెట్ స్టార్ మహమ్మద్ షమీ !

  • క్రికెట్ స్టార్ మహమ్మద్ షమీ రాజకీయ రంగ ప్రవేశం?

  • బీజేపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం!

  • జయంత్ చౌదరితో భేటీ.. షమీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ!

టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని..కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. గెలిస్తే మంత్రి పదవి ఇవ్వడానికి కమలం పార్టీ సిద్ధంగా ఉందని సమాచారం. ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాది పార్టీకి చెక్ పెట్టాలంటే ఒక బలమైన ముస్లిం నేతను రంగంలోకి దించాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఇటీవల మహమ్మద్ షమీ.. రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) అధినేత, కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ భేటీ తర్వాత షమీ రాజకీయ ప్రవేశంపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు, గతంలో 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హాట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా షమీ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు మరోసారి షమీ పేరు రాజకీయాల్లో వినిపిస్తుండటంతో ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, మహమ్మద్ షమీ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. షమీ నుంచి కానీ, బీజేపీ నాయకత్వం నుంచి కానీ చేరికపై ప్రకటన వెలువడలేదు. ఈ ప్రచారంలో నిజమెఃత అనేది రావే రోజుల్లో తేలనుంది . చూడాలి మరి ఏం జరుగుతుందో.

క్రికెట్ మైదానంలో తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టిన షమీ.. భవిష్యత్తులో రాజకీయ మైదానంలోకి కూడా అడుగుపెడతారా? అన్నది వేచి చూడాలి.  

ట్రెండింగ్ న్యూస్