తెలంగాణలో బియ్యం ఈ రేట్లకే విక్రయించాలి..లేదంటే

  • తెలంగాణలో బియ్యం ధరల పెరుగుదలపై ప్రభుత్వం సీరియస్..
  • ధరలకు గరిష్ట పరిమితులు విధిస్తూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం!

రాష్ట్రంలో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మార్కెట్లో బియ్యం కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై పౌరసరఫరాల శాఖ స్పందించింది. రాష్ట్రంలో బియ్యం కొరత లేదని స్పష్టం చేస్తూ.. వివిధ రకాల బియ్యానికి గరిష్ట విక్రయ ధరలను నిర్ణయించింది.

ఇకపై బీపీటీ, కేఎన్‌ఎం రకం బియ్యం కిలో గరిష్ట ధర 66 రూపాయలుగా నిర్ణయించారు. ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకం బియ్యం కిలో గరిష్ట ధర 74 రూపాయలుగా ఖరారు చేశారు. అలాగే హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రకం బియ్యం కిలో గరిష్ట ధరను 79 రూపాయలుగా నిర్ణయించారు.

నిర్ణయించిన గరిష్ట ధరల కంటే ఎక్కువకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసే వ్యాపారులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

మొత్తంగా బియ్యం ధరల నియంత్రణ, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో బియ్యం ధరలపై ప్రభుత్వ నియంత్రణ

  • బియ్యం ధరల పెరుగుదలపై ప్రభుత్వం సీరియస్.

  • బియ్యం కొరత ప్రచారంపై పౌరసరఫరాల శాఖ క్లారిటీ.

  • BPT, KNM: కిలో గరిష్ట ధర ₹66.

  • RNR, తెలంగాణ సోనా: కిలో ₹74.

  • HMT, JSR: కిలో ₹79.

  • నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు.

  • ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు.

ట్రెండింగ్ న్యూస్