- భారత్‌ను విదేశీయులు అవమానిస్తే నవ్వుతారా..?
- రాహుల్ గాంధీపై కిరణ్ రిజిజు ఘాటు వ్యాఖ్యలు !
భారతదేశాన్ని విదేశీయులు అవమానిస్తుంటే కొందరు భారతీయులు నవ్వుతారా..? అంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ నేతలు భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారత్ సమ్మిట్ 2026 సందర్భంగా యూరోపియన్ సోషలిస్టుల పార్టీ ప్రధాన కార్యదర్శి గియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని, దాన్ని కాపాడాలంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారతదేశ అంతర్గత రాజకీయ వ్యవహారాలపై విదేశీ నాయకులు వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“విదేశీయులు భారతదేశాన్ని అవమానిస్తున్నప్పుడు ఎవరైనా నవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా..? విదేశాలకు వెళ్లి భారతదేశాన్ని అవమానించే భారతీయుల గురించి నేను అడగడం లేదు” అంటూ ఆయన ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
![]()
![]()


రాహుల్ గాంధీ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఆయనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విదేశీ వేదికలపై భారతదేశాన్ని విమర్శించడం ఒకటైతే, ఇప్పుడు భారత గడ్డపైనే విదేశీ నాయకులు దేశ ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేయడం మరో వివాదానికి దారితీసిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
మొత్తానికి భారత్ సమ్మిట్‌లో విదేశీ ప్రతినిధుల వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మరోసారి రాజకీయ యుద్ధానికి తెరలేపాయి. భారత ప్రజాస్వామ్యంపై విదేశీయుల వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం..? దేశ రాజకీయాల్లో విదేశీ జోక్యానికి కాంగ్రెస్ అవకాశం కల్పిస్తోందా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.
-
భారత్‌ను అవమానిస్తే నవ్వుతారా?
-
రాహుల్‌పై కిరణ్ రిజిజు పరోక్ష అటాక్
-
విదేశీ నేతల వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
-
భారత్ సమ్మిట్‌తో రాజకీయ దుమారం
-
భారత ప్రజాస్వామ్యంపై విదేశీయుల వ్యాఖ్యలు
-
కాంగ్రెస్‌కు విదేశీ నేతల మద్దతుపై వివాదం
"VOTE Chor.. GADDI Chhod.
VOTE Thief.. LEAVE your seat "
– Party of European Socialists Secretary General, Giacomo Filibeck at Bharat Summit. pic.twitter.com/UUjSnrLmtN
— Gulte (@GulteOfficial) November 14, 2026