ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గింపు !

ప్రభుత్వ ఆరోగ్య వ్యయం మూడు రెట్లు పెరుగుదల.. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గింపు!

దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక గణాంకాలను వెల్లడించింది. గత పదేళ్లలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం మూడు రెట్లకు పైగా పెరిగిందని నేషనల్ హెల్త్ అకౌంట్స్ 2023–24 నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రజలు తమ జేబుల నుంచి సొంతంగా భరించే వైద్య ఖర్చుల వాటా గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది.

2013–14లో మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజలు సొంతంగా భరించే వైద్య ఖర్చుల వాటా 64.2 శాతంగా ఉండగా.. 2023–24 నాటికి అది 42.7 శాతానికి పడిపోయింది. అంటే ఏకంగా 21.5 శాతం పాయింట్ల తగ్గుదల నమోదైంది.

మరోవైపు ప్రభుత్వ ఆరోగ్య వ్యయం 2013–14లో రూ.1.30 లక్షల కోట్లుగా ఉండగా.. 2023–24 నాటికి రూ.4.14 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే గత పదేళ్లలో మూడు రెట్లకు పైగా పెరిగింది.

ఇక తలసరి ప్రభుత్వ ఆరోగ్య వ్యయం కూడా రూ.1,042 నుంచి రూ.2,959కి పెరిగింది. ఆరోగ్య రంగంలో సామాజిక భద్రత వ్యయం వాటా సైతం 6 శాతం నుంచి 11 శాతానికి చేరుకుంది.

ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ పెట్టుబడులు రూ.1.53 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. మొత్తంగా వైద్య సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. సామాన్యులపై వైద్య ఖర్చుల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా భారత్ పురోగమిస్తోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

  • ప్రభుత్వ ఆరోగ్య వ్యయం మూడు రెట్లు పెరుగుదల!

  • ప్రజల జేబులపై వైద్య ఖర్చుల భారం తగ్గింపు!

  • ఆరోగ్య వ్యయంలో 64.2 నుంచి 42.7 శాతానికి తగ్గిన ఓఓపీఈ!

  • ప్రాథమిక వైద్య సేవలకు రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులు!

ట్రెండింగ్ న్యూస్