సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి*- *తెలంగాణలో దాదాపు 20 వేల పోలీస్ ఖాళీలు ఉన్నప్పటికి*….
- *ప్రభుత్వం కేవలం 7,437 పోస్టులకే నోటిఫైడ్ చేసి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం సరికాదంటూ లేఖ రాసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి*
- నిరుద్యోగ యువతకు ఇది తీవ్ర అన్యాయం
- అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసిన మహేశ్వర్ రెడ్డి
- జీఓ 46 వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది
- ప్రాంతాల వారీగా కటాఫ్ విధానం వల్ల ప్రతిభ ఉన్న అభ్యర్థులు నష్టపోతున్నారు
- ఎన్నికల ముందు జీఓ 46ను రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
- అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని ఆరోపణలు
- రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరిన మహేశ్వర్ రెడ్డి
- ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్
- నిరుద్యోగులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లేఖ రాసిన మహేశ్వర్ రెడ్డి