బాలకృష్ణకు ప్రమాదం

త్రికాల తెలుగు : ఆంధ్ర ప్రదేశ్ : బాలకృష్ణ తన కొత్త సినిమా ‘NBK111’ షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. కాకినాడ పోర్టు ప్రాంతంలో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తొలుత మోకాలికి దెబ్బ తగిలిందని, తర్వాత వైద్యుల పరీక్షల్లో మైనర్ మసిల్ టియర్ (కండరాల స్వల్ప చీలిక) ఉన్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు సమాచారం. గాయం తీవ్రంగా లేదని, వైద్యులు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సూచించారు.

‘NBK111’ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని. షూటింగ్ షెడ్యూల్‌ను అవసరమైతే మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనతో నటులు జూ. ఎన్.టి. రామారావు, కళ్యాణ్ రామ్ ఇద్దరు ఓకే షాకింగ్ కు గురయ్యారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తీవ్రమైన ప్రమాదం కాదని, విశ్రాంతి తర్వాత షూటింగ్‌లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్రెండింగ్ న్యూస్