విడిపోయి బతకలేమని..ఒక ప్రేమ జంట..▶️

  • కుటుంబాల అంగీకారం లేక..చెట్టుకు ఉరేసుకుని యువ జంట మృతి

సెంజని : సెప్టెంబర్ 19: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లా సెంజని గ్రామంలో విషాద నెలకొంది. 17 ఏళ్ల సుధ, 19 ఏళ్ల అనిల్ మృతదేహాలు పొలంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని..పెళ్లికి కుటుంబాలు అంగీకరించలేదని గ్రామస్థులు తెలిపారు. కుటుంబాల నిరాకరణతో మనస్తాపానికి గురైన ఇద్దరూ గ్రామానికి కిలోమీటర్ దూరంలోని పొలంలో అత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఉదయం మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ న్యూస్