ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బీజేపీ తిరంగా ర్యాలీ▶️

త్రికాల తెలుగు: ఎల్లారెడ్డి ప్రతినిధి (ఆగస్టు 14) : భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ పిలుపు మేరకు ఎల్లారెడ్డి బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆగస్టు 14, 2026న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.

పట్టణంలో రామాలయం నుండి అంబేద్కర్ చొరస్తా వరకు, అక్కడ నుండి గాంధీ చౌక్, శివాజీ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కొన్ని దుకాణదారులకు జాతీయ జెండాలు పంపిణి చేసారు బీజేపీ నాయకులు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్, పట్టణ అధ్యక్షులు రాజేష్, మండల అధ్యక్షులు పెద్దెడ్ల నరసింహులు, సాయిరెడ్డి, అశోక్, కాశినాథ్, సత్యం, శివ,రాజు, సాయిలు, సర్చేంద్ శ్రీనివాస్ మరియు తులసి, బబ్లు కౌశిక్, S.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్