
కొట్టాల్ శివయ్య నూతన గృహానికి డాక్టర్ పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ సహాయం.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొట్టాల్ గ్రామానికి చెందిన శివయ్య కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ సమయం లో జపాన్ శాస్త్రవేత్త రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పైడి ఎల్లారెడ్డి స్వయంగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అదే సమయంలో ఇంటి స్లాబ్ నిర్మాణం కోసం సిమెంట్ సహాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, వారి నూతన గృహ నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివయ్య కుటుంబం నిర్మించుకుంటున్న నూతన గృహ నిర్మాణం కోసం సిమెంట్ బస్తాలను అందజేశారు.

ఈ సందర్భంగా శివయ్య కుటుంబ సభ్యులు పైడి ఎల్లారెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్, ఎల్లారెడ్డి రూరల్ అధ్యక్షులు పెద్దెడ్ల నరసింహరాజు, కిష్టయ్య సార్ , సాయిలు, అమర్‌నాథ్ , సుభాష్ గౌడ్ , అలాగే PYR TEAM సభ్యులు పాల్గొన్నారు.

https://www.facebook.com/share/r/1MWV1vEsu9/
https://www.facebook.com/share/r/1HsD16Q1YA/
https://www.facebook.com/share/r/1BuyYPCpH9/