- ఎస్ఐఆర్ రెండో విడతపై ఫోకస్ పెట్టాలి-రాంచందర్ రావు
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండవ విడత ప్రక్రియపై బిజెపి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. రాంచందర్ రావు పిలుపునిచ్చారు

శనివారం ఆగస్టు 8 2026న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ‘విశ్వేశ్వరయ్య భవన్’లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు SIR రాష్ట్ర కన్వీనర్ శ్రీ వేముల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఫేజ్-2 రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ…” SIR ప్రక్రియ ముగియడానికి కేవలం మరొక రెండు రోజులు మాత్రమే (ఆగస్టు 10 వరకు) సమయం ఉన్నందున, ప్రతి నియోజకవర్గంలోనూ అర్హులైన ప్రతి ఒక్కరిచేత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటు నమోదు (Enrollment) వేగవంతంగా పూర్తి చేయించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ గడువు ముగిసిన తర్వాత కూడా రాబోయే రోజుల్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ల పరిశీలన, నకిలీ ఓట్ల గుర్తింపు, ఆభ్యంతరాల (Objections) దాఖలు వంటి కీలకమైన అంశాలు ఉంటాయని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఫారమ్-7 (ఓట్లతొలగింపు), ఫారమ్-8 (సవరణలు) సరైన రీతిలో దాఖలు చేయడం, నోటీసులకు తగిన ఆధారాలతో లీగల్‌గా సమాధానాలు ఇవ్వడం, పోలింగ్ బూత్‌ల రేషనలైజేషన్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించడంపై బిఎల్ఏ-1లు (BLA-1) మరియు లీగల్ టీమ్స్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఓటర్ల జాబితా పారదర్శకత అత్యంత కీలకమని, ఆ బాధ్యతను బిజెపి ప్రతినిధులు సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు..