బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం జూలై 31 తెల్లవారుజామున 12:50 నిమిషాలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

జూలై 26 ఉదయం ఆయనకు తీవ్ర అస్వస్థత కలగడంతో కుటుంబ సభ్యులు తొలుత హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాతా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రత్యేక అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోదాకా తరలించారు.అక్కడ అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు.

రాజకీయ ప్రస్థానం
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ప్రారంభంలో యూత్ కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం ప్రారంభించి, 2001లో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌లో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) అభ్యర్థిగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా కూడా పనిచేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం జూలై 31, 2026న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన పెద్ది. #brs pic.twitter.com/cu6KTitcgG
— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) July 30, 2026
ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.