రైతులకు శుభవార్త..రూ.18 వేల కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు..రిలీజ్ ▶️

  • పీఎం కిసాన్ నిధులతో రైతులకు భరోసా..
  • అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం చేయూత!
  • రూ.18 వేల కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు..రిలీజ్

గుజరాత్ : దేశంలోని కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లకు పైగా నిధులను నేరుగా జమ చేసినట్లు గుజరాత్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెల్లడించారు  మోదీ.

ఇప్పటివరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మొత్తం దాదాపు రూ.4.5 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసినట్లు ప్రధాని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ప్రత్యేకతగా నిలుస్తోంది. వ్యవసాయ పెట్టుబడులకు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఈ నగదు రైతులకు కొంత ఆర్థిక చేయూతనిస్తోంది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ట్రెండింగ్ న్యూస్