శివాజీ మహారాజు విగ్రహావిష్కరణ @ చద్మల్ తాండ

త్రికాల తెలుగు : ప్రతినిధి : కామారెడ్డి జిల్లా : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చద్మల్ తాండలో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, వీరత్వానికి, ధైర్యానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీకైన చత్రపతి శివాజీ మహారాజు భవ్య విగ్రహావిష్కరణ మహోత్సవం వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విగ్రహదాత, ప్రముఖ శాస్త్రవేత్త, డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, విగ్రహావిష్కరణ చేశారు.

శుక్రవారం, సెప్టెంబర్ 4, 2026న జరిగిన…ఈ కార్యక్రమంలో డా.పైడి ఎల్లారెడ్డితో పాటుమాజీ ఎమ్మెల్యే నేరెళ్ల ఆంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, అనసూయ రెడ్డి, అంబీర్ మనోహర్ రావు పాల్గొన్నారు.

ఈ మహోత్సవానికి సమస్త హిందూ బంధువులు, గ్రామీణులు , శివాజీ మహారాజు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీర శివాజీ మహారాజ్ ఆశీస్సులు పొందారు.

శివాజీ మహారాజు భవ్య విగ్రహావిష్కరణ మహోత్సవం సందర్భంగా జై భవాని! జై శివాజీ!! హర హర మహాదేవ్!! అనే నినాదాలతో చద్మల్ తాండ మొత్తం మారుమోగింది.

జై భవాని! జై శివాజీ!! హర హర మహాదేవ్!!

ట్రెండింగ్ న్యూస్