పొంగిపొర్లుతున్న..పోచారం డ్యామ్ ▶️

పొంగిపొర్లుతున్న..పోచారం డ్యామ్

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండల పరిధిలోని పోచారం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. మంగళవారం ఉదయమే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఇటీవల ఎగువ ప్రాంతాలైన మంచిప్ప, గాంధారి, లింగంపేట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం లింగంపేట్ పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మెదక్ మండలాల రైతుల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తుంది. దీంతో  రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టు ముఖ్య వివరాలు:

మొత్తం నిల్వ సామర్థ్యం: 1.820 టీఎంసీలు (సిల్టేషన్ తర్వాత ప్రస్తుత సామర్థ్యం) , పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 14.64 అడుగులు. మెదక్, గిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. తాగునీటి అవసరాలకు కూడా కీలక వనరుగా ఉపయోగపడుతోంది. పోచారం ప్రాజెక్టు కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దులో మంచిప్ప వాగు (అల్లయేరు)పై నిజాం కాలంలో నిర్మించిన చారిత్రక ప్రాజెక్టు. ఇది

ముఖ్య వివరాలు నిర్మాణం: 1917లో శంకుస్థాపన చేసి, 1922లో పూర్తి చేశారు. అసలు సామర్థ్యం 2.423 టీఎంసీలు కాగా, పూడిక కారణంగా ప్రస్తుతం 1.820 టీఎంసీలకుచేరింది. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మెదక్ మండలాల రైతుల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తుంది.  దీని సమీపంలోనే ‘పోచారం వన్యప్రాణుల అభయారణ్యం’ ఉంది. ఇది అందమైన రిజర్వాయర్ మరియు పిక్నిక్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది,ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నాందేడ్, గుల్బర్గా జిల్లాల నుండి పోచారం ప్రాజెక్ట్ మరియు అభయారణ్యాన్ని సందర్శిస్తారు. పోచారం అభయారణ్యంలో వివిధ రకాల పక్షులు మరియు జంతువులు ఉన్నాయి. పోచారం ప్రాజెక్టు సమీపంలో నిజాం ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మించింది.

ట్రెండింగ్ న్యూస్