మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన రైల్వే పోలీస్ ! ▶️

  • హఫీజ్‌పేట్‌లో అమానుష ఘటన
  • మహిళపై పోలీస్ కానిస్టేబుల్ దాడి?
  • జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్?
  • హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద ఘటన
  • వైరల్‌గా మారిన దాడి వీడియో
  • మహిళపై దాడి ఎందుకు?
  • ఘటనపై ఉన్నతాధికారుల దర్యాప్తు?
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : స్థానికులు

హఫీజ్‌పేట్ : సెప్టెంబర్ 18: త్రికాల తెలుగు : హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై రైల్వే పోలీస్ కానిస్టేబుల్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళను కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారినట్లు సమాచారం. మహిళపై కానిస్టేబుల్ ఈ విధంగా దాడి చేయడానికి కారణమేంటి? అసలు మహిళకు, పోలీస్ సిబ్బందికి మధ్య ఏం జరిగింది? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

ట్రెండింగ్ న్యూస్