ఇన్నాళ్లు మౌనం..ఇకపై రణక్షేత్రం

త్రి.విశ్లేషణ: గులాబీ బాస్ కేసీఆర్ ఈజ్ బ్యాక్! తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన పరిణామం ఇది. ఇన్నాళ్లూ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారనే విమర్శలన్నింటికీ కేసీఆర్ తనదైన శైలిలో తెరదించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు కేసీఆర్ ఆస్పత్రికి రావడం… కేవలం ఒక రోగిని పరామర్శించడం మాత్రమే కాదు, అదొక పొలిటికల్ అస్త్రం!

ఇన్నాళ్లూ సైలెంట్… ఇకపై వయొలెంట్! కేసీఆర్ మార్క్ రాజకీయం షురూ. ఫాంహౌస్ టూ హాస్పిటల్… గులాబీ బాస్ ఎంట్రీతో పాలిటిక్స్ హీట్. ఇక రాజకీయం రంజుగా మారనుంది. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న ఒకే ఒక పెద్ద ప్రశ్న… కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ బహిరంగంగా జనాల్లో కనిపించకపోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. “కేసీఆర్ ఎక్కడ?” అంటూ ప్రతిసారీ గులాబీ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. సరిగ్గా ఇదే తరుణంలో, కేసీఆర్ ఒక్కసారిగా తెరపైకి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శను కేసీఆర్ ఒక ‘పొలిటికల్ లాంచ్ ప్యాడ్’ లాగా వాడుకున్నారనేది విశ్లేషకుల మాట.

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్న గులాబీ బాస్, ఎట్టకేలకు ఆస్పత్రికి వచ్చి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్, అకస్మాత్తుగా బయటకు వచ్చి ఒక ముఖ్య నేతను పరామర్శించడం వెనుక బలమైన రాజకీయ సంకేతాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ”నేను ఉన్నాను… ఎవరికీ భయం లేదు” అనే భరోసాని తన పార్టీ నేతలకు ఇచ్చేందుకే కేసీఆర్ ఈ పరామర్శను ఎంచుకున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన నేతలను కేసీఆర్ ఎప్పుడూ విస్మరించరనే సెంటిమెంట్‌ను మరోసారి బలంగా ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లడంలో గులాబీ బాస్ సక్సెస్ అయ్యారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ బహిరంగ సభలకు, ప్రజల్లోకి రావడానికి కొంత విరామం ఇచ్చారు. కేవలం కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తున్న తరుణంలో, కేసీఆర్ బయటకు రాకపోవడంపై అధికార పార్టీ నేతలు విమర్శలు కూడా గుప్పించారు. అయితే, పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శతో కేసీఆర్ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి, క్రియాశీలక పాత్రలోకి రాబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. ఇది కేవలం ఒక సాధారణ పరామర్శ మాత్రమే కాదని, గులాబీ బాస్ గ్రౌండ్‌లోకి దిగుతున్నారు అనడానికి ఇదొక ట్రైలర్ లాంటిదని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో సెంటిమెంట్‌ను ఎలా వాడుకోవాలో కేసీఆర్‌కు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. కేడర్‌ను, నమ్ముకున్న నాయకులను కష్టకాలంలో పరామర్శించడం ద్వారా కేసీఆర్ తనదైన శైలిలో పాత సెంటిమెంట్‌ను మళ్ళీ రగిలించారు. “నాయకుడు మన వెంటే ఉన్నాడు” అనే ధైర్యాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు అందించడంలో కేసీఆర్ ప్లాన్ వర్క్ ఔట్ అయింది.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో, నర్సంపేటలో పార్టీని నడిపిన బలమైన నాయకులలో ఒకరు. పార్టీ కోసం కష్టపడిన ఏ కార్యకర్తను, ఏ నేతను కేసీఆర్ విస్మరించరనే సందేశాన్ని కేడర్‌కు పంపించారు గులాబీ దళపతి. ష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించడం. పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి కీలక నేతను నేరుగా పరామర్శించడం ద్వారా కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాలని భావించారు.

రానున్న రోజుల్లో కేసీఆర్ జిల్లాల పర్యటనలు, ప్రజా సమస్యలపై ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను కూడగట్టేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇన్నాళ్ల నిశ్శబ్దాన్ని వీడి బయటకు రావడం వల్ల కిందిస్థాయి క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా ఇతర రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారనడానికి ఈ పరామర్శ ఒక నాంది. కేసీఆర్ ఆస్పత్రి పర్యటన కేవలం ఒక ఆరోగ్య విచారణగానే కనిపించినా, దాని వెనుక ఉన్న పొలిటికల్ టైమింగ్ మాత్రం చాలా పెద్దదే. నిశ్శబ్దంగా ఉన్న గులాబీ దళం ఇకపై దూకుడు పెంచనుందనే సంకేతాలను ఈ ఘటన స్పష్టం చేస్తోంది. “పులి బయటకి రాబోతోందా?” అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పనున్నప్పటికీ, కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ రీ-ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందన్నది మాత్రం సుస్పష్టం.


ఇప్పటివరకు కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారంటే అది కేవలం తుఫాను ముందు ప్రశాంతతేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడు పెంచేందుకు కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు తీరుపై బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ఈ పరామర్శ ఒక ల్యాంచ్ ప్యాడ్ లాంటింది. ఇన్నాళ్ల మౌన వీడక తప్పని పరిస్థితుల్లో, కేసీఆర్ బయటకు రావడం గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడమే కాక, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వేడిని రాజేసింది. ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్ రూపంలో బయటకు వచ్చింది కేవలం ఒక మాజీ సీఎం కాదు… ఒక పొలిటికల్ టైగర్! ఇకపై తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింత పెరగడం ఖాయం.

-జి.మహేష్‌ కుమార్ ✍️
సీనియర్ జర్నలిస్ట్-949 1383 455

ట్రెండింగ్ న్యూస్