నా చివరి శ్వాస వరకు అంటూ..మోదీ జీ భావోద్వేగం ▶️

  • బనస్కాంత సభలో మోదీ భావోద్వేగ ప్రసంగం

  • సామాన్య కుటుంబం నుంచి దేశ ప్రధాని వరకు

  • ప్రజలే తనకు సేవ చేసే అవకాశం కల్పించారని వ్యాఖ్య

  • తొలుత గుజరాత్‌కు.. ఆపై దేశానికి సేవ

  • ప్రజాసేవే దేశసేవ అని మోదీ ఉద్ఘాటన

  • గుజరాత్ అభివృద్ధి.. దేశ అభివృద్ధికి బాట

  • దేశ విజయాల ఘనత ప్రజలకే అంకితం

  • ప్రజల ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటా

  • చివరి శ్వాస వరకు ప్రజాసేవకే అంకితం

  • 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని

గుజరాత్‌లోని బనస్కాంతలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజలు దేశసేవ చేసే అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు.  “మా కుటుంబంలో తరతరాలుగా కనీసం ఒక గ్రామానికి సర్పంచ్‌ కావాలనే కల కూడా ఎవరూ కనలేదు. అలాంటి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నన్ను మీరు నమ్మి, సేవ చేసే బాధ్యత అప్పగించారు. తొలుత గుజరాత్‌కు, ఆ తర్వాత దేశానికి సేవ చేసే అవకాశం కల్పించారు” అని మోదీ అన్నారు.

ప్రజలకు చేసే సేవే దేశానికి చేసే సేవ అని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ అభివృద్ధి దేశ అభివృద్ధికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. దేశం కోసం తాను సాధించిన ప్రతి విజయానికి దేశ ప్రజలే కారణమని చెబుతూ, “దీనికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా జీవితంలోని చివరి క్షణం వరకు మీకు సేవ చేయడానికే అంకితమవుతాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

25 ఏళ్ల ప్రజా జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజల పట్ల తన కృతజ్ఞతను, సేవాభావాన్ని మోదీ ఈ ప్రసంగంలో వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ న్యూస్