స్వచ్ఛంద ( NGO ) సంస్థలు ఖర్చుల లెక్క చెప్పాల్సిందే !

FCRA అంటే ( The Foreign Contribution (Regulation) Act ) విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం. ఈ బిల్లు విదేశాల నుంచి వచ్చే విరాళాలు (Foreign Contributions) పొందే సంస్థలు, ట్రస్టులు, ఎన్జీవోలు (NGOs)పై ఉన్న చట్టంలో కొన్ని మార్పులు చేయడానికి కేంద్రప్రభుత్వం 2026 మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది మరియు ప్రస్తుతం పార్లమెంట్ పరిశీలనలో ఉంది.

FCRA రిజిస్ట్రేషన్ రద్దు, లొంగదీత (surrender), లేదా గడువు ముగిసినప్పుడు ఆ సంస్థ విదేశీ నిధులతో ఏర్పడిన ఆస్తులు, మిగిలిన నిధుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక Designated Authorityని నియమిస్తుంది. ఆ సంస్థ తర్వాత తన రిజిస్ట్రేషన్‌ను తిరిగి పొందితే, నిబంధనల ప్రకారం ఆస్తులు, మిగిలిన నిధులు తిరిగి ఇవ్వబడే విధానం ప్రతిపాదించబడింది. రిజిస్ట్రేషన్ పునరుద్ధరించబడకపోతే, నిర్దిష్ట ప్రక్రియ తర్వాత ఆ ఆస్తులు ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించే అవకాశం ఉంటుంది. FCRA ఉల్లంఘనలకు గరిష్ఠ జైలు శిక్షను 5 సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి తగ్గించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు FCRA కేసుల్లో విచారణ ప్రారంభించే ముందు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన నిబంధనను కూడా ప్రతిపాదించింది.

ప్రభుత్వం చెప్పిన ఉద్దేశ్యం :
ప్రభుత్వం ప్రకారం, ఈ మార్పులు విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, సరైన నిర్వహణను బలోపేతం చేయడానికేనని తెలిపింది.

ఈ బిల్లు ను ఎందుకు తెచ్చారు ?
ఈ బిల్లును తీసుకురావడానికి ప్రభుత్వం చెప్పిన ప్రధాన కారణాలు: ఈ కింది vidanga ఉన్నాయ్. చట్టంలో ఉన్న ఖాళీని (legal gap) పూరించడం ఇప్పటి వరకు ఒక NGO లేదా సంస్థ యొక్క FCRA రిజిస్ట్రేషన్ రద్దు అయినా, గడువు ముగిసినా, లేదా స్వచ్ఛందంగా లొంగదీసుకున్నా, ఆ సంస్థ విదేశీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులు, మిగిలిన నిధులను ఎలా నిర్వహించాలనే విషయంలో స్పష్టమైన చట్టపరమైన విధానం లేదు. ఈ బిల్లు ఆ ఖాళీని పూరించడానికి తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత పెంచడం విదేశాల నుంచి వచ్చే నిధులు వాటి ఉద్దేశ్యానికే వినియోగించబడుతున్నాయా లేదా అనే విషయంపై మరింత పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం చెబుతోంది.

జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ:

విదేశీ నిధులు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉపయోగించబడకుండా చూడటం FCRA చట్టం యొక్క ప్రధాన ఉద్దేశమని, ఈ సవరణలు ఆ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

ఆస్తుల నిర్వహణకు స్పష్టమైన విధానం:

FCRA రిజిస్ట్రేషన్ కోల్పోయిన సంస్థల విదేశీ నిధులతో ఏర్పడిన ఆస్తులను ఒక Designated Authority పర్యవేక్షించే విధానాన్ని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. తరువాత సంస్థకు రిజిస్ట్రేషన్ తిరిగి వస్తే ఆస్తులను తిరిగి ఇవ్వడం, రాకపోతే చట్టం ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించే ప్రక్రియను నిర్దేశిస్తోంది.

“ఈ బిల్లు వల్ల క్రైస్తవ చర్చిలు, హిందూ దేవాలయాలు, మసీదులు, ఇతర మత సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?”

ఈ బిల్లు ఒకే మతాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించబడలేదు. FCRA కింద విదేశీ విరాళాలు స్వీకరించే అన్ని అర్హ సంస్థలకు—క్రైస్తవ చర్చిలు, హిందూ సంస్థలు, మసీదులు, గురుద్వారాలు, బౌద్ధ, జైన, అలాగే ఇతర NGOలు—వర్తించేలా ఉంటుంది.

ప్రభావం ఎలా ఉంటుందంటే:

క్రైస్తవ చర్చిలపైవిదేశాల నుంచి విరాళాలు స్వీకరించే చర్చిలు, మిషనరీ సంస్థలు FCRA నిబంధనలను కచ్చితంగా పాటించాలి. రిజిస్ట్రేషన్ రద్దు లేదా గడువు ముగిస్తే, విదేశీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులు, మిగిలిన నిధులు కొత్త విధానంలో ప్రభుత్వం నియమించిన అధికారి పర్యవేక్షణలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ తిరిగి లభిస్తే, చట్టం ప్రకారం వాటిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. హిందూ దేవాలయాలు, ట్రస్టులపై విదేశీ విరాళాలు తీసుకునే దేవాలయాలు లేదా ట్రస్టులు కూడా ఇదే నిబంధనలకు లోబడి ఉంటాయి. FCRA రిజిస్ట్రేషన్ చెల్లుబాటులో ఉన్నంత వరకు సాధారణ కార్యకలాపాలపై ఈ బిల్లు ప్రత్యక్ష ప్రభావం ఉండదు. మసీదులు మరియు ఇస్లామిక్ ట్రస్టులపై విదేశీ నిధులు స్వీకరించే మసీదులు లేదా వక్ఫ్‌కు సంబంధించిన సంస్థలకూ ఇదే నియమాలు వర్తిస్తాయి. రిజిస్ట్రేషన్ సమస్యలు వస్తే, ఇతర సంస్థల మాదిరిగానే కొత్త ఆస్తుల నిర్వహణ విధానం అమల్లోకి వస్తుంది.

ఇతర NGOపై :

విద్య, వైద్యం, పేదల సంక్షేమం, విపత్తు సహాయం వంటి రంగాల్లో పనిచేసే విదేశీ నిధులు పొందే NGOలకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.

ప్రభుత్వం ప్రకారం ఈ సవరణల ఉద్దేశ్యం:

*విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత పెంచడం.
*ఆస్తుల నిర్వహణకు స్పష్టమైన చట్టపరమైన విధానం తీసుకురావడం.
*నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడం.

చట్టం ప్రకారం ఈ బిల్లు ఏ ఒక్క మతానికీ ప్రత్యేకంగా వర్తించదు. విదేశీ విరాళాలు స్వీకరించే అన్ని అర్హత సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయి. అయితే, ఈ మార్పుల అమలు విధానం గురించి ప్రభుత్వం మరియు విమర్శకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ట్రెండింగ్ న్యూస్