- హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం
- సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు
- ట్రక్కు పార్కింగ్‌తో ప్రమాదం
- కారు కనిపించక.. బస్సు డ్రైవర్ షాక్
త్రికాల తెలుగు : హైదరాబాద్‌లో అబ్దుల్లాపూర్ మెట్ బాట సింగారం పెట్రోల్ / జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కీలక విషయాలను స్పష్టం చేసింది. యూటర్న్ తీసుకుంటున్న కారు.. నిబంధనలకు విరుద్ధంగా అస్తవ్యస్తంగా పార్క్ చేసిన ట్రక్కు కారణంగా బస్సు డ్రైవర్‌కు కనిపించలేదు. అదే సమయంలో అకస్మాత్తుగా కారు ఎదురుపడటంతో.. దాన్ని తప్పించేందుకు బస్సు డ్రైవర్ సడన్‌గా స్టీరింగ్‌ను ఎడమవైపు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి.. నేరుగా పెట్రోల్ బంక్‌లో ఉన్న మరో కారును ఢీకొట్టింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే.. కారు డ్రైవర్ అజాగ్రత్తగా వ్యవహరించడం, నిబంధనలకు విరుద్ధంగా ట్రక్కును పార్క్ చేయడం ప్రమాదానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గురువారం సెప్టెంబర్ 10, 2026న ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్-బాట సింగారం పెట్రోల్ బంక్ లో కి దూసుకెళ్లిన బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్. కీలక విషయాలను స్పష్టం చేసింది. అప్పుడు అసలు ఏం జరిగిందో చూడండి. 10/09/2026#accident #roadsafety #cctv #trikalatelugu #news pic.twitter.com/oOWuzrzvci
— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) September 11, 2026