ఎస్‌ఐఆర్ పై ఎల్లారెడ్డి ఆర్డీఓ అఖిలపక్ష సమావేశం 

ఎల్లారెడ్డి ప్రతినిధి ( ఆగస్టు 05 ) : ఈ రోజు స్పెషల్ ఇంటెన్సివ్ర్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి ఆర్డీఓ రోడ్డ ప్రభాకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతి, ఓటరు జాబితా సవరణలు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ఆర్డీఓ గారు మాట్లాడుతూ..”నియోజకవర్గంలో మొత్తం 2,28,503 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, వాటిని బీఎల్ఓ యాప్ ద్వారా 100% డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. పరిశీలనలో 22,283 ఫారాలు మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, డబుల్ ఓటర్లుగా గుర్తించినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఆదేశాల మేరకు 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను విభజించి కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కొత్తగా ఆమోదించిన పోలింగ్ కేంద్రాలు (9):
గాంధారి – 3, లింగంపేట్ – 3, నాగిరెడ్డిపేట్ – 1, సదాశివనగర్ – 1, ఎల్లారెడ్డి – 1

మండలాల వారీగా వివరాలు:
1. అన్‌మ్యాప్ ఫారాలు:
ఎల్లారెడ్డి – 683, తాడ్వాయి – 189, నాగిరెడ్డిపేట్ – 331, గాంధారి – 1,316, లింగంపేట్ – 490, రామారెడ్డి – 778, రాజంపేట – 131, సదాశివనగర్ – 1,142

2. మరణించిన ఓటర్లు:
తాడ్వాయి – 978, నాగిరెడ్డిపేట్ – 902, గాంధారి – 1,203, లింగంపేట్ – 1,253, రామారెడ్డి – 654, ఎల్లారెడ్డి – 1,117, రాజంపేట – 342, సదాశివనగర్ – 1,182

3. శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు:
తాడ్వాయి – 1,211, నాగిరెడ్డిపేట్ – 952, గాంధారి – 1,885, లింగంపేట్ – 1,336, రామారెడ్డి – 1,111, ఎల్లారెడ్డి – 1,503, రాజంపేట – 479, సదాశివనగర్ – 1,394

4. డబుల్ ఓటర్లు:
గాంధారి – 799, లింగంపేట్ – 1,187, నాగిరెడ్డిపేట్ – 150, రాజంపేట – 410, రామారెడ్డి – 270, సదాశివనగర్ – 973, తాడ్వాయి – 557, ఎల్లారెడ్డి – 363

తదుపరి కార్యాచరణ:
డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల: ఆగస్టు 10

క్లెయిమ్స్ & అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 10 వరకు (ఆర్డీఓ కార్యాలయంలో)

తుది ఓటరు జాబితా విడుదల: అక్టోబర్ 10

ఈ సమావేశంలో స్థానిక తహసీల్దార్ ప్రేమ్ కుమార్, గిర్దావర్ భరత్, ఎన్నికల సిబ్బంది, ఎంఐఎం పార్టీ తరఫున అబ్దుల్ రజాక్, బీజేపీ తరఫున మర్రి బాల కిషన్ , పెద్దెడ్ల నరసింహరాజు, బీఆర్ఎస్ తరపున అడ్కరి బబ్లు, కాంగ్రెస్ పార్టీ తరఫున మొహమ్మద్ అజ్హర్. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్