అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు పొడిగింపు

త్రికాల తెలుగు : హైదరాబాద్ :  తెలంగాణ హైకోర్టు రాష్ట్ర జర్నలిస్టుల ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటును 2026 ఆగస్టు 3 వరకు పొడిగించింది. పలు జర్నలిస్ట్స్ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా హై కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణ వరకు ప్రస్తుతం ఉన్న అక్రిడిటేషన్ కార్డులు చెల్లుబాటులోనే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే..పొడిగింపు కోరుతున్న జర్నలిస్టుల జాబితాను కోర్టులో సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది. తదుపరి విచారణను న్యాయస్థానం 2026 ఆగస్టు 3కు వాయిదా వేసింది.

ట్రెండింగ్ న్యూస్