
త్రికాల తెలుగు హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి నివేదిక అందజేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమె కవిత గారు మాట్లాడుతూ..
ఉద్యమకారులకు న్యాయం చేసే విషయంలో ఆలస్యం చేయవద్దు. స్వతంత్రత సైనిక్ సమ్మాన్, హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ రూల్ పొజిషన్ ను కమిటీ స్టడీ చేయాలి. వాటిలో ఉన్న విధంగా ఉద్యమకారులకు ప్రయోజనం కలిగించాలి. కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ అనే భావన ఉంది.. అది తప్పని నిరూపించాలి . ఉద్యమకారుల కోసం బీఆర్ఎస్ లో అంతర్గతంగా పోరాటం చేసి బలైన వ్యక్తిని నేను. నా సూచనలు, సలహాల ద్వారా ఉద్యమకారులకు కొంత మేలు జరిగిన నా జన్మ ధన్యమైనట్లే. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించటం, గౌరవించటం కోసం కమిటీ ఏర్పాటు చేయటం సంతోషం. ఉద్యమ కారుల సంక్షేమం కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ మమ్మల్ని ఆహ్వానించిన కమిటీకి ధన్యవాదాలు. ఉద్యమకారులకు మేలు చేసేందుకు నా వంతుగా సూచనలు ఇచ్చే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నా.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులతో భుజం భుజం కలిపి పోరాటం చేసిన వ్యక్తిని నేను. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందంటూ అంతర్గత వేదికల్లో చెప్పి వారి కోసం పోరాటం చేశాను. దాని పర్యవసానంగానే బీఆర్ఎస్ లో బలైన వ్యక్తిని నేను. ఇవ్వాళ నేను చెప్పే రెండు మాటలతో ఉద్యమకారులకు మేలు జరిగితే నా జన్మ ధన్యమైనట్లు భావిస్తా. అదే విధంగా తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు ముందుగా చేతులేత్తి నమస్కరిస్తున్నా. ఉద్యమంలో ఉన్న భావోద్వేగపూరితమైన అంశాలను రూల్ పొజిషన్ గా కన్ వర్ట్ చేయాల్సిన బాధ్యత ఈ కమిటీ మీద ఉంది. మనం ఆ రూల్ పొజిషన్ అయినా, ఆర్డర్ అయినా సరే భారత ప్రభుత్వం నుంచి తీసుకుంటాం. మన స్వతంత్ర పోరాటంలో కూడా కోట్లాది మంది పాల్గొన్నారు. రకరకాల భావజాలాలు ఉన్నప్పటికీ అంతా స్వతంత్ర పోరాటంలో ఒక్కటి గా ఫైట్ చేశారు. అప్పుడు కొట్లాది మంది ఉద్యమంలో పాల్గొంటే లక్షలాది మందికి మాత్రమే గుర్తింపు వచ్చింది. ఆ సంఖ్య తక్కువైనప్పటికీ ఆ స్ఫూర్తి మాత్రం గొప్పది. భారత ప్రభుత్వం స్వతంత్రత సైనిక్ సమ్మన్ యోజన పేరుతో లక్షా 71 వేల మందికి పెన్షన్లు ఇచ్చింది. వాళ్లు చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబానికి మేలు జరిగేలా రూల్ పొజిషన్ ఉంది. దాన్ని కమిటీ స్టడీ చేయాలని కోరుతున్నా. ఆ స్కీమ్ పెట్టినప్పుడు ఒక్క బ్రిటీష్ ప్రభుత్వంపైనే కాకుండా ఫ్రెంచ్, పోర్చుగీస్ వాళ్లపై పోరాటం చేసిన వాళ్లను కూడా గుర్తించారు. మనం కూడా 1969 ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఇందులో జత చేయాలి. సాయుధ రైతాంగ పోరాటం నాటి ఉద్యమకారులను కూడా కలపాలని కొంతమంది అంటున్నారు. కానీ సాయుధ రైతాంగ పోరాటాన్నిభారత ప్రభుత్వం హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ గా గుర్తించింది. ప్రత్యేకంగా రూల్ పొజిషన్ పెట్టి 7 వేల మందికి పెన్షన్లు ఇచ్చింది. అవసరమైతే ఆ రూల్ పొజిషన్ ను కూడా స్టడీ చేయాలి. అప్పట్లో ఆర్య సమాజ్ వాళ్లు ఇచ్చిన సూచనలను భారత ప్రభుత్వం గమనంలోకి తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో సంఘాలు పనిచేశాయి. వారి రికమాండేషన్లను కూడా గమనంలోకి తీసుకోవాలి. మేము కూడా ఉద్యమంలో జాగృతి సంస్థ ద్వారా పెద్ద ఎత్తున ఫైట్ చేశాం. ఎన్నో వేల మంది ఉద్యమకారుల జాబితా మా వద్ద ఉంది. మీరు అనుమతిస్తే వారి పూర్తి డేటా, ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు ఇస్తాం. సంఖ్య పెరుగుతుందని కమిటీ భావిస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఉద్యమంలో పాల్గొన్న వారి పట్ల విశాల హృదయంతో పనిచేయాలి. స్వతంత్ర ఉద్యమంలో ఆరు నెలలు జైల్లో ఉన్నవారికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కూడా జైల్లో ఉన్నవాళ్లు, ఎఫ్ఐఆర్ లు, ఛార్జిషీట్లు నమోదైన వాళ్ల విషయంలో ఆలస్యం చేయకుండా వారిని గుర్తించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు కూడా వెసులుబాటు కల్పించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అలాంటి వెసులుబాటు ఇవ్వాలి. స్వతంత్ర ఉద్యమంలో అండర్ గ్రౌండ్ పీరియడ్ ను కూడా కన్సిడర్ చేశారు. హౌస్ అరెస్ట్ అయిన వాళ్లను కూడా గమనంలోకి తీసుకున్నారు. ప్రాపర్టీ లాస్, డిస్సబులిటీ, పోలీస్ అట్రాసిటీ అనుభవించిన వాళ్లను వెంటనే గుర్తించాలి. పదిసార్లు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ల విషయంలో వెంటనే వారికి గుర్తింపు ఇవ్వాలి. రాజేష్ నాయక్, యాకుబ్ రెడ్డి లాంటి వాళ్లు ముళ్లకంప పై పడి బతుకులు ఆగం చేసుకున్నారు. అలాంటి వాళ్ల విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్లను గుర్తించాలి. ఉద్యమంలో జాబ్ పోయిన వాళ్లకు మేలు చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది. మన ముందే ఇద్దరు కానిస్టేబుళ్లు ఉద్యోగం కోల్పోయారు. ఎంతో మంది టీచర్లను ఇబ్బంది పెట్టారు. కొన్ని చోట్ల ఉద్యమంలో పాల్గొన్న వాళ్ల డీలర్ షిప్ లను క్యాన్సల్ చేయించారు. వాళ్లందరీ విషయంలో కమిటీ మానవతా ధృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నా. ఉద్యమకారులు ఎవరైనా చనిపోతే మొదటి ప్రియారిటీ వాళ్ల భార్య, లేదంటే పిల్లలు, తల్లితండ్రులకు ఇవ్వాలి. ఏ స్కీమ్ పెట్టిన సరే స్కామ్ అవుతుంది. అందుకే స్కామ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఉద్యమకారుల విషయంలో కో ప్రిజనర్ ను అడగటంతో పాటు విద్యావంతుల వేదికలో పాల్గొన్న వాళ్ల ద్వారా ఉద్యమకారుల వివరాలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత కమిటీ ఏర్పాటు చేయటం విచారకరం. ఈ ముఖ్యమంత్రి ఉద్యమంలో లేనప్పటికీ కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్ లాంటి వాళ్ల మాటలు నమ్మి కాంగ్రెస్ కు ఉద్యమకారులు సపోర్ట్ చేశారు. కానీ ఉద్యమకారులు బిక్షాటన చేసి ఆందోళనలు చేసిన తర్వాత గానీ కమిటీ ఏర్పాటు చేయలేదు.

ఉద్యమకారుల విషయంలో మీరు నిర్ణయం ఎప్పుడు తీసుకున్న సరే అధికారంలోకి వచ్చిన తేదీ నాటి నుంచే వారికి ప్రయోజనాలు అందించాలి. జార్ఖండ్ లో ఉద్యమకారులకు వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు. అదే విధంగా అక్కడ పర్మినెంట్ కమిటీ ఉంది. వీలైనంత ఇక్కడ కూడా ఆ విధంగా ఏర్పాటు చేయాలి. గోవా, దాద్రా నగర్ హవేలి, బీహార్, యూపీ, మహారాష్ట్రల్లో ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తున్నారు. వాటిని స్టడీ చేస్తే సరిపోతుంది. రూల్ పొజిషన్, చట్టబద్దత అంటూ సమయం వృథా చేయవద్దు. కేకే కమిటీ అంటేనే కాలయాపన అన్న భావన ఉంది. అది తప్పని ఈ కమిటీ నిరూపించాలని కోరుతున్నా. ఒక టైమ్ బాండ్ లోపల ఉద్యమకారులను గుర్తించి వారికి ఏ విధంగా మేలు చేస్తారో చెప్పాలి. జార్ఖండ్ లో మాదిరిగా గుర్తింపు కార్డులు ఇచ్చి ఉద్యమకారులను గౌరవించాలి
-కవిత కల్వకుంట్ల #TRS