శివ చరణ్ రెడ్డి..క్షమాపణ చెప్పాలి-యాదవులు

జక్కిడి శివచరణ్ రెడ్డి బీసీ, యాదవ సమాజానికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివ చరణ్ రెడ్డిని సస్పెండ్ చేయాలి!

-కుందేళ్ళ అర్జున్ యాదవ్, వనపర్తి నియోజకవర్గ కంటెస్టడ్ ఎమ్మెల్యే 

బీసీల బిడ్డ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్ పై కాంగ్రెస్ నాయకుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వనపర్తి నియోజకవర్గ కుందేళ్ళ అర్జున్ యాదవ్ 

హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ చౌరస్తా విజయవాడ హైవే పై ఈశ్వరమ్మ యాదవ్ కు సంఘీభావంగా సోమవారం, జూలై 13, 2026న నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ కంటెస్టడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీగా రాజకీయ పునఃర్జన్మ ఇచ్చిన అలాంటి పెద్ద మనిషిని కనీసం వయస్సు కూడా గౌరవం ఇవ్వకుండా రాజకీయ అక్కసు, కుల అహంకారం తో మాట్లాడటం హేయమైన చర్యగా భావిస్తున్నాం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారిపై కాంగ్రెస్ నాయకుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

బీసీ బిడ్డా అయిన యాదవ సామాజిక వర్గానికి చెందిన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేసిన జక్కిడి శివ చరణ్ రెడ్డిని వెంటనే యూత్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం

అలాగే, ఆయన చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లోగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వివిధ ప్రముఖులు, బీసీ, యాదవ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్