మంచి కోసం ఎప్పటికీ ముందుంటాను-పైడి ఎల్లారెడ్డి

శ్రీ సరస్వతి శిశు మందిర్ లింగంపేట పాఠశాల నూతన భవనానికి జపాన్ శాస్త్రవేత్త బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి వెయ్యి సంచుల సిమెంట్ బహుకరణ. 

త్రికాల తెలుగు కామారెడ్డి జిల్లా : లింగంపేట శిశు మందిర్ నూతన భవనం నిర్మాణంలో ఉంది. కావున బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డిని శిశు మందిర్ పాఠశాల ప్రబంధకారిని బృందం వారిని కలిసి.. భవన నిర్మాణంలో మీ వంతు పాత్ర ఉండాలని కోరడం జరిగింది. అనంతరం పైడి ఎల్లారెడ్డి  శిశు మందిర్ నూతన భవన నిర్మాణానికి 1000 సంచుల సిమెంటును ఇస్తానని..శిశు మందిర్ పాఠశాల ప్రబంధకారిని సభ్యులకు తెలియజేశారు.

ఈ సందర్బంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ..”శిశుమందిర్ పాఠశాలల్లో స్వచ్ఛమైన విద్యను నేర్పిస్తున్నారు. అంతేకాదు భారతదేశ సనాతన ధర్మం, కుటుంబ విలువలతో కూడుకున్నటువంటి  విద్యను అందిస్తున్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచే  సమాజం పట్ల తల్లిదండ్రుల పట్ల, పెద్దలపట్ల ఏ విధమైన స్నేహపూరితంగా ఉండాలనే విషయాలను, అంటే  పూర్తిగా విలువలతో కూడిన విద్యను ఈ శిశు మందిరాల్లో చెప్తున్నారు. ఇలాంటి పాఠశాలల నిర్మాణానికి నేను ఎప్పుడూ సహరిస్తాను” అని పైడి ఎల్లారెడ్డి  తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శిశుమందిర్ ప్రబంధకారణి సభ్యులు కొత్త దుర్గయ్య శ్రీనివాస్ గౌడ్, పెద్ది శివయ్య, అంకం గంగాధర్, జంగం రాజేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్