- “ఇరుముడి” సినిమా వేయాలని పబ్లిక్ ధర్నా‘
త్రికాల తెలుగు : నారాయణపేట జిల్లా : ఇరుముడి’ సినిమా వేయాలని ప్రేక్షకులు ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్‌లోని వెంకటరమణ థియేటర్ వద్ద ‘వందలాది మంది ప్రేక్షకులు ధర్నాకు దిగారు.. ఎందుకు ధర్నా? అంటే…రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా అక్కడ మంచి స్పందనతో నడుస్తుండగా, థియేటర్ యాజమాన్యం అకస్మాత్తుగా దాన్ని తొలగించి యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో ఇరుముడి చూడటానికి వచ్చిన ప్రేక్షకులు, అలాగే అయ్యప్ప స్వామి భక్తులు థియేటర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

మరో కారణం ఏమిటి అంటే… గత కొన్ని రోజులుగా ఇరుముడి షోలు హౌస్‌ఫుల్ కావడంతో చాలామందికి టికెట్లు దొరకలేదని, చివరకు సినిమా చూడాలని వచ్చిన రోజే ప్రదర్శన నిలిపివేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం ఒప్పుకునే వరకు “టాక్సిక్ వద్దు.. ఇరుముడినే వేయండి” స్వామియే శర్మ అయ్యప్ప , జై శ్రీ రామ్ అంటూ మక్తల్ ప్రేక్షకులు నినాదాలు చేశారు. చివరికి ఏమైంది? అంటే…ప్రేక్షకుల ఒత్తిడితో థియేటర్ యాజమాన్యం వెనక్కి తగ్గి ఇరుముడి సినిమాను తిరిగి ప్రదర్శించాలని నిర్ణయించింది. దీంతో ఆందోళన విరమించారు.
"ఇరుముడి" సినిమా వేయాలని పబ్లిక్ ధర్నా@ తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్‌లోని వెంకటరమణ థియేటర్ తేదీ- 26/08/2026#Public #protest #demanding #the #screening of the #movie #Irumudi pic.twitter.com/bSJxNtc44X
— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) August 26, 2026