- అంత్యక్రియలకు పైసా లేదు..ఊరంతా ఒక్కటైంది @ మల్కాపూర్
త్రికాల తెలుగు : తెలంగాణ: కామారెడ్డి జిల్లా: ప్రతినిధి: చివరి ప్రయాణానికి కూడా డబ్బులు లేని దుస్థితి ఆ కుటుంబానిది. ఇంటి పెద్దను కోల్పోయిన విషాదం ఒకవైపు.. అంత్యక్రియలు ఎలా చేయాలన్న ఆందోళన మరోవైపు. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మాత్రం చూస్తూ ఊరుకోలేదు. తమకు తోచినంత ఆర్థిక సాయం అందించారు. అందరూ కలిసి ఆ మహిళకు చివరి వీడ్కోలు పలికారు. కష్టకాలంలో బంధువులే కాదు.. ఊరంతా ఒక కుటుంబంగా నిలిచింది.

ఏం జరిగింది అంటే..
మల్కాపూర్ గ్రామానికి చెందిన పెద్దెడ్ల వెంకవ్వ ( వయసు 64 ) తన ఒక్క కొడుకు కృష్ణ ( వయసు 25-30 ).తో ఉంటూ అతి కష్టం మీద బతుకు వెళ్లదీస్తోంది ప్రతి రోజు కూలి, నాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. గత కొంతకాలంగా వెంకవ్వ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కులస్తులు ఆమెను ఎల్లారెడ్డి మండల కేంద్రములోని ఒక ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రాణాలు దక్కలేవు. చివరికి మంగళవారం( ఆగస్టు 25 2026 )న తుదిశ్వాస విడిచింది.
“కష్టంలో ఉన్నప్పుడు మనిషికి మనిషే అండ”
వెెంకవకు ఒక్కడే కుమారుడు ఉన్నాడు. వెంకవ్వ కాలం చేసిన పరిస్థితిలో కొడుకు కృష్ణ దగ్గర చెల్లి గవ్వ అంటే ఒక్క రూపాయి కూడా లేదు. దీంతో మానవత్వంతో గ్రామ సర్పంచ్ కొండా యోగితామధుతో పాటు కులస్తుల స్పందించారు. ముందుగా కలస్తులు ఇంటింటికి కొంత డబ్బు సమకూర్చారు. తరువత సర్పంచ్ పిలుపుతో గ్రామంలో ఉన్నవారితో పాటు ఉద్యోగ, వ్యాపారరీత్యా హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలలో ఉన్న వారు కూడా ఫోన్ పే ద్వారా తోచిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆ డబ్బుతోనే నిరుపేద మహిళా వంకవ్వ అంత్యక్రియలను పూర్తి చేశారు.

తన కుటుంబ పరిస్థితి తెలుసుకొని తన అమ్మగారి అంత్యక్రియలు జరిపించిన గ్రామస్తులకు , గ్రామానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కొడుకు కృష్ణ పాదాభివందనాలు తెలిపాడు.
పేదింటి మహిళా అంత్యక్రియలను గ్రామం అంతా ఆర్థిక సాయం చేసి జరిపించారని తెలిసి..చుట్టుపక్కల గ్రామాలతో పాటు తెలిసిన ప్రతి ఒక్కరు మల్కాపూర్ గ్రామస్తులను అభినందిస్తున్నారు. అన్ని గ్రామాలు కూడా పేదవారికి ఆపద వస్తే అండగా ఉండాలని చాటి చెప్తున్నారు. మల్కాపురం గ్రామం వలే ఆదర్శంగా ఉండాలని అంతటా చర్చించుకుంటున్నారు.
చివరిగా..”మనిషి చనిపోయినా.. మానవత్వం బతికే ఉంది”అని మల్కాపూర్ లో జరిగిన ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.