అదృష్టం అంటే ఇదేనేమో! : మంత్రి పొంగులేటి ▶️

అదృష్టం అంటే ఇదేనేమో! : మంత్రి పొంగులేటి

గ్రేటర్ హైదరాబాద్ : రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లిలోని ఓ చిన్నారి కుటుంబాన్ని అదృష్టం వరించింది. ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రాలో ఓ చిన్నారితో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టోకెన్ తీయించారు. అయితే ఆ టోకెన్ చిన్నారి కుటుంబం పేరు మీదే రావడం అక్కడున్న వారు ఆశ్చర్య పోయారు. ఈ విషయాన్ని మంత్రి Xలో షేర్ చేశారు. అదృష్టం అంటే ఇదేనని, ఆ చిన్నారి కుటుంబం సొంతింట్లో చల్లగా ఉండాలని దీవించినట్లు పేర్కొన్నారు.

  • ఘటన: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లక్కీ డ్రా.
  • ప్రాంతం: లక్ష్మీగూడ, మైలార్‌దేవపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గం, హైదరాబాద్. 
  • జరిగింది ఏమిటి?: పారదర్శకంగా నిర్వహించిన ఈ డ్రాలో టోకెన్ తీయడానికి ఒక చిన్నారిని కోరగా, ఆ బాలుడు తీసిన టోకెన్ నంబర్ అతడి స్వంత కుటుంబానికే (జరపుల లక్ష్మి కుటుంబం) వచ్చింది.
  • మంత్రి స్పందన: ఇది దేవుడి ఆశీర్వాదం అని, ఇలాంటి అరుదైన సంఘటన ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ బాలుడి కుటుంబాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలోనూ ఈ వీడియోను పంచుకున్నారు

ట్రెండింగ్ న్యూస్