బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌-2026..‘.జమ్మి చెట్టు’కు గుర్తింపు

  • బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్‌లో ‘జమ్మి చెట్టు’కు గుర్తింపు!
  • తెలంగాణ ప్రభుత్వం, TGFDC సంయుక్తంగా బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్–2026 నిర్వహణ 
  • పోటీలకు వేలాది ఎంట్రీలు..షార్ట్ ఫిల్మ్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన ‘జమ్మి చెట్టు’
  • విరించి పుట్ల కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్
  • తొలి ప్రయత్నంలోనే విరించి పుట్లకు గుర్తింపు
  • ‘జమ్మి చెట్టు’కు కన్సోలేషన్ ప్రైజ్
  • అవార్డుతో సంతోషం వ్యక్తం చేసిన విరించి పుట్ల
  • భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని మంచి చిత్రాలు తీస్తానని వెల్లడి

 

హైదరాబాద్ అక్టోబర్ 17:  త్రికాల తెలుగు: తెలంగాణ ప్రభుత్వం, TGFDC సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్–2026లో ‘జమ్మి చెట్టు’ షార్ట్ ఫిల్మ్ ప్రతిభ చాటుకుంది.

ఈ పోటీలకు వేలాది ఎంట్రీలు రాగా.. షార్ట్ ఫిల్మ్ విభాగంలో విరించి పుట్ల కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో తెరకెక్కిన ‘జమ్మి చెట్టు’ షార్ట్ ఫిల్మ్ నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో విరించి పుట్లకు కన్సోలేషన్ ప్రైజ్ లభించింది.

తన తొలి ప్రయత్నంలోనే ఈ స్థాయి గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందని విరించి పుట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రోత్సాహంతో భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని మంచి చిత్రాలను తెరకెక్కిస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా TGFDC చైర్మన్ దిల్ రాజుకు, జ్యూరీ చైర్మన్, దర్శకుడు హరీష్ శంకర్‌కు, జ్యూరీ సభ్యుడు కాసర్ల శ్యామ్ అన్నకు, అలాగే రచ్చ రావన్నలకు విరించి పుట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తొలి అడుగులోనే గుర్తింపు.. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం. ‘జమ్మి చెట్టు’ చిత్ర బృందానికి అభినందనలు!

ట్రెండింగ్ న్యూస్